ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏబి వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తివేయాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 02, 2022, 10:18 AM

సీనియర్ ఐపీఎస్ ఏబి వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తివేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ప్రభుత్వాన్ని కోరారు. ప్రజాస్వామిక వ్యవస్థలపై జగన్మోహన్ రెడ్డి కక్షపూరిత వైఖరి సరికాదని అభిప్రాయపడ్డారు. వైసీపీకి వత్తాసు పలకని అధికారులను వేధింపులకు గురిచేయటం వల్ల, అధికారుల్లో అభద్రతాభావం నెలకొందన్నారు. 


కోర్టు తీర్పులను సైతం లెక్క చేయకపోవడం దుర్మార్గమని ఆయన మండిపడ్డారు. కక్షసాధింపు చర్యలతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆభాసుపాలైందనిఏబి వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తివేసి, ప్రజలకు వ్యవస్థల పట్ల నమ్మకాన్ని కల్పించాలని రామకృష్ణ హితవుపలికారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com