విశాఖ జిల్లాలో కొవిడ్ కేసులు రోజూ అంతకంతకూ పెరుగుతూ వస్తున్నాయి. పరీక్షలు తక్కువగానే జరుగుతున్నా కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదవ్వడం వైద్యారోగ్య శాఖను ఆందోళనకు గురిచేస్తుంది. ఈనాడు కథనం ప్రకారం గురువారం 65 కేసులు నమోదవ్వగా ..శుక్రవారం వాటి సంఖ్య 72కు పెరిగింది. వీటితో మొత్తం కేసుల సంఖ్య 1,92,292కు చేరింది. వీరిలో 1,90,688 మంది కోలుకున్నారు. మరో 336 మంది ఇళ్లలో చికిత్స పొందుతున్నారు.
కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కొవిడ్ పరీక్షలు పెంచాలని భావించినా రోజుకు 300 నుంచి 350 మధ్యలోనే చేయగలుగుతున్నారు. శుక్రవారం కూడా 300 మందికి పరీక్షించగా 72 మందికి పాజిటివ్ తేలింది. పాజిటివిటీ రేటు ఒక్కసారి 24 శాతం పెరిగిపోయింది. కొవిడ్ ఉద్ధృతంగా ఉన్న రోజుల్లో కూడా ఇంత పాజిటివిటీ రేటు నమోదు కాలేదు. ప్రస్తుతం పరీక్షలు తక్కువగా చేయడం వల్లే ఈ రేటు పెరుగుతుందని కాకపోతే కొవిడ్ బారిన పడినవారు ఆసుపత్రుల్లో చేరాల్సినంత తీవ్రత లేదు.