గుంటూరు: చదువులో వెనుకబడ్డానన్న దిగులుఠో తమ కుమార్తె ఇల్లు విడిచి వెళ్లిపోయినట్లు మున్నంగి గ్రామానికి చెందిన ఓ మహిళ శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సదరు మహిళ కుమార్తె డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతుంది.
గురువారం రాత్రి అందరితో పాటే ఆమె కూడా భోజనం చేసి పడుకుంది. ఉదయం చూస్తే తన కుమార్తె కనిపించలేదని ఆమె తల్లి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు ఎస్సై బాలరామిరెడ్డి తెలిపారు.