గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకు కరోనా పాజిటివ్. హైద్రాబాద్ లో హోం ఐసోలేషన్ లో ఉన్న వంశీ. ఇటీవల పంజాబ్ రాష్ట్రంలోని మొహలీ ఐఎస్ బీ క్యాంపస్ లో క్లాసులకు వెళ్లిన ఎమ్మెల్యే రోజూ దాదాపు 14 గంటలు క్యాంపస్ లోనే గడపాల్సి రావడం, ఈ క్రమంలోనే అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే.
ఆ తర్వాత హైద్రాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో పూర్తి స్థాయి వైద్య పరీక్షలు చేయించికుని వైద్యుల సూచనల మేరకు విశ్రాంతి తీసుకుంటున్న తరుణంలో కరోనా సోకింది. గతంలో కూడా వంశీ కరోనా బారినపడ్డారు. ఎమ్మెల్యే హోం ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారని, కోలుకున్న తర్వాత నియోజకవర్గానికి వస్తారని ఆయన సన్నిహితులు తెలిపారు.