ఏపీలో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్‌గా తేలింది. మాజీ మంత్రి, ఎమ్మెల్యే మేకతోటి సుచరిత, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిలకు కోవిడ్ సోకింది. వీరిద్దరూ ప్రస్తుతం వారి ఇళ్లలోనే హోం ఐసోలేషన్‌లో ఉన్నారు.
అయితే వారిద్దరూ ప్రజాప్రతినిధులు కావడంతో ఎక్కువ మందిని రోజూ కలుసుకుంటుంటారు. దీంతో తమను ఇటీవల కాలంలో కలిసిన వారంతా కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని ఎమ్మెల్యేలు సూచించారు.