టీడీపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పత్తికొండ నియోజకవర్గ ఇంచార్జ్ కే. ఈ శ్యామ్ కుమార్ ఆదేశాలమేరకు పత్తికొండ నియోజకవర్గంలోని ఐదు మండల కేంద్రాలలో శనివారం పెంచిన ఆర్టీసీ చార్జీలకు నిరసన ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాలో రాష్ట్ర పార్టీ కమిటీ నాయకులు, జిల్లా పార్టీ కమిటీ నాయకులు, నియోజకవర్గ కమిటీ నాయకులు, మండల పార్టీ నాయకులు, గ్రామ పార్టీ నాయకులు, మహిళా నాయకురాలు పాల్గొన్నారు.