వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి అంటూ ఆంధ్రజ్యోతిలో వచ్చిన తప్పుడు కథనాన్ని వైయస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి , ఎంపీ విజయసాయిరెడ్డి ఖండించారు. అసంతృప్తి వైయస్ఆర్సీపీలో కాదు..చంద్రబాబు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ మెదళ్లలో ఉందని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. టీడీపీని జనం చెప్పుతో కొట్టినప్పుడల్లా కరకట్ట అక్రమకొంపలో ఎదో కథనం వండుతారు. దాన్ని 'అంధ'జ్యోతిలో మోస్తారు. అసంతృప్తి వైయస్ఆర్ సీపీలో కాదు చంద్రబాబు,రాధాకృష్ణ మెదళ్లలో ఉంది. కుక్కతోకలాగే వారి బుద్దీ వంకరే. మొన్నటిదాకా ఉద్యోగుల్లో అసంతృప్తన్నారు. ఆత్మకూరు ఫలితం తర్వాత నోరు మూసుకున్నారు అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.