గెలిచినా ఏమి చేస్తావయ్యా నువ్వు... ఆయన గెలిచాడు ఏమి చేసాడు... ఓ తల్లి అడిగిన ప్రశ్నకు నెల్లూరు నియోజక వర్గ జనసేన ఇంచార్జి కేతంరెడ్డి వినోద్ రెడ్డి , పవనన్న ప్రజాబాట కార్యక్రమంలో భాగంగా సమాధానం చెప్తూ... పవనన్న ప్రభుత్వంలో మేము తప్పు చేస్తే మా కాలర్ పట్టుకుని అడిగే స్వేచ్ఛ మీకు వస్తుంది తల్లి అని సమాధానం ఇచ్చారు. ఐతే ఈ కార్యక్రమానికి నెల్లూరు నగరంలో శ్రీకారం చుట్టి 46వ రోజు కావడం విశేషం. దాదాపుగా సంవత్సరం పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుంది అని తెలియజేసారు. పారిపోయే వాళ్ళం కాదు, సమస్యలని పారత్రోలే వారము అని తెలియజేసారు.