నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన తర్వాత కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తొలిసారి వయనాడ్‌కు వచ్చారు. అంతేకాకుండా వయనాడ్‌లోని రాహుల్ కార్యాలయంపై కూడా ఇటీవలే గుర్తు తెలియని దుండగులు దాడికి దిగారు. ఈ నేపథ్యంలో రాహుల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీకి వయనాడ్ ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావడం గమనార్హం.
రాహుల్ గాంధీ తన సొంత నియోజకవర్గం కేరళలోని వయనాడ్‌లో నిర్వహించిన ర్యాలీకి భారీ జన సందోహం హాజరైంది. వయనాడ్‌లోని ప్రధాన రహదారిపై జరిగిన ఈ ర్యాలీలో కనుచూపు మేర జనంతో ఆ రోడ్డు నిండిపోయింది. ఇసుకేస్తే రాలనంత మంది హాజరయ్యారు అన్న మాటకు ఈ ర్యాలీ అద్దం పట్టింది. ర్యాలీలో రాహుల్ గాంధీ ఎక్కడున్నారో కూడా కనిపించకపోగా... ర్యాలీలో జనం కదిలిన తీరు చీమల దండునే తలపించింది.