చబా టైఫూస్ విధ్వంసం కారణంగా శనివారం దక్షిణ చైనా సముద్రంలో ఓ నౌక రెండు ముక్కలైంది. ఈ ప్రమాదంలో 30 మంది గల్లంతయ్యారు. హాంకాంగ్ అధికారులు రెస్కూ ఆపరేషన్ చేపట్టి, ముగ్గురిని కాపాడగలిగారు. హాంకాంగ్‌కు నైరుతి దిశలో 160 నాటికల్ మైళ్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. నౌక ఉన్న ప్రదేశంలో గంటకు 144 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి.