దేశంలో కరోనా కేసుల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 16,103 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా కరోనా మహమ్మారి కారణంగా 31 మంది చనిపోయారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,11,711కు చేరింది. అయితే మహమ్మారి నుంచి 13,929 మంది కోలుకోవడం ఊరట కలిగిస్తోంది. నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 10,10,652 కరోనా డోసులు పంపిణీ చేశారు.