ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం కేదార్‌నాథ్ ఆలయ గర్భగుడిలోకి భక్తుల నిషేధాన్ని ఆలయ కమిటీ ఎత్తివేసింది. దీంతో శుక్రవారం నుంచి గర్భగుడిలోకి భక్తులను అనుమతిస్తున్నారు. యాత్రికుల రద్దీ, భద్రతా సమస్యలతో మే 6న నిషేధం విధించినట్లు బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ ఛైర్మన్ అజేంద్ర అజయ్ తెలిపారు. యాత్రికుల సంఖ్య తగ్గిన కారణంగా ఆ నిషేధం ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa