కేరళ మాజీ ఎమ్మెల్యే పీసీ జార్జ్‌ను శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు. సోలార్ ప్యానెళ్ల కుంభకోణంలో నిందితురాలైన ఓ మహిళతో ఆయన అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలొచ్చాయి. సదరు మహిళ ఫిర్యాదుతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపర్చారు. కాసేపటికే కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన విడుదలయ్యారు. తనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలను ఆయన ఖండించారు. అవి అవాస్తమవమని కొట్టిపారేశారు.