టీమిండియా అభిమానులకు శుభవార్త. ఇటీవల కోవిడ్ బారిన పడిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ కరోనా నుండి కోలుకున్నాడని తెలుస్తోంది. కోవిడ్ నిర్ధారణ అయ్యే సమయానికి స్వల్ప లక్షణాలతో బాధపడుతున్న రోహిత్ తాజాగా పూర్తిగా కోలుకున్నాడని సమాచారం. జులై 7 నుండి ఇంగ్లండ్తో జరిగే టీ20 లకు రోహిత్ అందుబాటులో ఉండనున్నారు.