ఇతరుల తప్పును ఎత్తిచూపి నిదించడం మనం సమాజంలో చూస్తుంటాం. కానీ తనవల్ల జరిగిన తప్పుకు స్వయంగా బాధ్యత వహించడం అరుదుగా చూస్తుంటాం. అలాంటి ఘటనే ఇటీవల చోటుచేసుకొంది. దానికి సంబంధించిన వీడియో ఒక్కటి వైరల్ అవుతోంది. పిల్లలను బాగా చదవమని, మంచి మార్కులు తెచ్చుకోమని తల్లిదండ్రులు వెంటపడుతుంటారు. మార్కులు సరిగ్గా రాకపోతే గట్టిగా మందలిస్తుంటారు. ఇంకొందరు కొడుతుంటారు. కానీ ఓ తండ్రి తన కొడుకు మార్కులను చూసి.. వీటికి భిన్నంగా ప్రవర్తించాడు. మార్క్ లిస్ట్ చూసి బోరున ఏడ్చాడు. జరగరానిదేదో జరిగిపోయిందన్నట్టు ఒక్కసారిగా ఒక్కటే విలిపించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటన చైనాలో జరిగింది.
హెనాన్‌లో జెంగ్‌జౌలో నివసించే ఓ వ్యక్తి తన బిడ్డ లెక్కల్లో మంచి మార్కులు సాధించాలనే ఉద్దేశంతో స్వయంగా తానే టీచర్‌గా మారాడు. ఏడాది పాటు ప్రతిరోజు లెక్కలు బోధించేవాడు. దీనికోసం లేట్‌గా పడుకునేవాడు. గతంలో వందకి 40, 50, 80, 90 మార్కులు వస్తుండేవి. ఈసారి ఇంకా ఎక్కువ మార్కులు వస్తాయని ఆశపడ్డాడు. కానీ దీనికి రివర్స్‌లో ఈసారి గణితంలో 100 మార్కులకు కేవలం 6 మార్కులు మాత్రమే వచ్చాయి. ఆ మార్కుల లిస్ట్‌ను చూసి తండ్రి నోటమాట రాలేదు. అసలు భరించలేకపోయాడు. ఒక్కటే ఏడ్వడం మొదలుపెట్టాడు.
"నేను ఇక పట్టించుకోను. నా ప్రయత్నం వృథా అయింది. ఇక తనంతట తాను కష్టపడని." అంటూ ఆ వ్యక్తి ఏడ్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోను Weiboలో పోస్ట్ చేశారు. అప్పటి నుంచి మిలియన్ కంటే ఎక్కువ మంది చూశారు. ఇంతకీ ఆ కొడుకు ఎందుకంతగా దిగజారిపోయాడో అర్థం కాలేదు. తండ్రి టీచింగ్ అంత దారుణంగా ఉందా..? లేదా ఒత్తిడి వల్ల అబ్బాయి విసుగు చెందాడా..? తండ్రికి గుణపాఠం చెప్పేందుకు కావాలనే అలా రాశాడా..? అనేది తెలియలేదు.