కారంపూడి: మండల పరిధిలో నాటుసారా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై బాలకృష్ణ హెచ్చరించారు. ఆదివారం ఆయన కార్యాలయంలో మాట్లాడుతూ మండల పరిధిలో అక్రమంగా నాటుసారా తయారు చేసినా, విక్రయించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
మండలాన్ని నాటుసారా రహితంగా మార్చడానికి సహకరించాలన్నారు. మండల పరిధిలో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే డయల్ 100 కు సమాచారం అందించాలని కోరారు.