తిరుమలలో ఆదివారం కూడా భక్తుల రద్దీ కొనసాగింది. శనివారం ఉదయం నుంచి తిరుమల క్షేత్రం యాత్రికులతో కిటకిటలాడుతున్న విషయం తెలిసిందే. శనివారం తరహాలోనే ఆదివారం కూడా అర్ధరాత్రి వరకు రద్దీ కొనసాగింది. రాత్రి ఏడు గంటలకు వైకుంఠం క్యూకాంప్లెక్స్ ని కంపార్టుమెంట్లతోపాటు నారాయణగిరి ఉద్యానవనంలోని షెడ్లు నిండిపోయాయి. దాంతో సర్వదర్శనానికి 18 గంటల దర్శన సమయం పడుతోంది.