కేరళ సీఎం పినరయి విజయన్‌పై కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే పీసీ జార్జ్ భార్య ఉషా జార్జ్ సంచలన వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. సీఎంను తుపాకీతో కాల్చేస్తానని ఆదివారం పేర్కొన్నారు. ఇవి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. తన భర్త పీసీ జార్జ్‌ను రాజకీయ కక్షతో సీఎం వేధిస్తున్నారని, తప్పుడు కేసులు పెట్టిస్తున్నారని ఆమె ఆరోపించారు. లైంగిక ఆరోపణల కేసులో అరెస్ట్ అయిన పీసీ జార్జ్‌కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.