పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అధికారిక నివాసంలోకి గుర్తు తెలియని వ్యక్తి శనివారం అర్ధరాత్రి దాటాక చొరబడ్డాడు. గోడపైకి ఎక్కి రాత్రంతా అక్కడే ఉండిపోయాడు. ఆదివారం ఉదయమే అతడిని గమనించి, భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు.
అతడిని అరెస్ట్ చేసి, విచారణ చేపట్టారు. ఇటీవలే సీఎం నివాసం సమీపంలో జంట హత్యలు కలకలం రేపాయి. తాజా భద్రతా వైఫల్యంపై అధికారులు దృష్టిసారించారు.