ఇంట్లో మనీ ప్లాంట్ పెడితే అదృష్టాన్ని తెచ్చిపెడుతుందని నమ్ముతారంతా. వాస్తుశాస్త్రం ప్రకారం.. మనీ ప్లాంట్లను సరైన దిశలో నాటకపోతే సమస్యలు వస్తాయి. ఈ మొక్కను ఈశాన్య దిశలో నాటడం వల్ల ఆర్థికంగా నష్టపోతారు. అలాగే, ఈ మొక్కను ఎల్లప్పుడూ ఆగ్నేయ దిశలో ఉంచాలి. ఇక మనీ ప్లాంట్ తీగలు పెరుగుదల శ్రేయస్సుకు ఎండిన మనీ ప్లాంట్ దురదృష్టానికి చిహ్నం. మనీ ప్లాంట్‌ను ఇంట్లోనే నాటాలి, ఇంటి బయట నాటడం శ్రేయస్కరం కాదు.