యూపీలో అంబేద్కర్‌నగర్ జిల్లా జలాల్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. టీచర్(30)తో అనైతిక సంబంధం పెట్టుకున్న మైనర్ స్టూడెంట్ (17) ఆమె గర్భం దాల్చడంతో హతమార్చాడు. వివాహేతర సంబంధం ఇష్టం లేకే నిందితుడు హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇంట్లో వస్తువులు దొంగిలించి, దోపిడీగా దృష్టి మరల్చినట్లు గుర్తించారు. జూన్ 1 హత్య జరగగా, నిందితుడిని ఆదివారం అరెస్ట్ చేశారు.