నర్సాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నర్సాపురం స్థానిక బస్టాండ్ ఆవరణలో నిరసన కార్యక్రమం చేపట్టారు. టీడీపీ ఇంచార్జి పొత్తూరి రామరాజు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో ప్రజలపై రవాణాచార్జీల ధరలు పన్నుల ధరలు పెంచడం తప్ప వేరే అభివృద్ధి ఏమీ లేదంటూ ఆర్టీసీ బస్సులో ప్రయాణించే మధ్యతరగతి, పేద ప్రజల నెత్తిన చార్జీల ధరలు పెంచుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని వైయస్సార్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దేశంలోనే మన రాష్ట్రం అప్పుల్లోనూ రాష్ట్ర ప్రజలపై ట్యాక్సుల పెంచడంలోనూ మొదటి స్థానంలో ఉందని ఎద్దేవా చేశారు.