ఈ రోజు చోడవరం నియోజకవర్గం జనసేన పార్టీ ముఖ్య నాయకులు సిరిపురపు రమేష్ నాయకత్వంలో బుచ్చయ్యపేట మండలం గున్నెంపుడి గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబాన్ని జనసేన పార్టీ ఆదుకుంటుందని భరోసా ఇస్తూ ఆర్థికసాయం చేయటం జరిగింది. వారితో పాటు ఆ గ్రామంలో కష్టంలో ఉన్న మరో నాలుగు కుటుంబాలకి ఆర్థిక సహాయం చేయడం జరిగింది, అనంతరం పార్టీ ముఖ్య జనసైనికులతో ఆత్మీయంగా కలవడం జరిగింది. జనసేన పార్టీ ప్రజలకి కష్టాలలో ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, జనసేన పార్టీకి మద్దత్తు పలకవలసిన కాలం వచ్చిందని దానిని బట్టి రాబోయే ఎన్నికలలో జనసేన పార్టీని గెలిపించుకుందామని పిలుపునిచ్చారు.