హిమాచల్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కుల్లు జిల్లాలో ఓ ప్రైవేటు బస్సు లోయలో పడింది. ఈ ఘటనలో 16 మంది దుర్మరణం చెందారు.మృతుల్లో స్కూల్‌కు వెళ్లే చిన్నారులు ఉన్నారు.కుల్లు జిల్లాలోని జంగ్లా గ్రామం సమీపంలో ఉదయం 8 గంటల ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. సైంజ్ ప్రాంతానికి వెళ్తోన్న ఈ బస్సు అదుపుతప్పి కొండపై నుంచి లోయలో పడింది. సమాచారమందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. ఇప్పటివరకు 16 మృతదేహాలను వెలికితీశారు. మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులు, మహిళలే ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులున్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాద తీవ్రతకు బస్సు పూర్తిగా నుజ్జునుజ్జయింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది.