జగన్ మోహన్‌రెడ్డి గారూ మీ 151+5 (మీ భాషలో చెప్పాలంటే సంతలో కొనుక్కున్న పశువులు), 49.95 శాతం ఓటింగ్ నిజమైనదైతే.. తెలుగుదేశం జెండా చూసినా, పసుపురంగు కనిపించినా, మా కార్యకర్త ఎదురొచ్చినా వణికిపోతున్నారెందుకు? అని టీడీపీ నాయకులూ నారా లోకేష్ ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వ అక్రమాలపై రాయదుర్గం 8వవార్డులో ఐటిడిపి నాయకుడు మారుతి నిలదీస్తే సమాధానం చెప్పలేని మీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి పోలీసులతో నిర్బంధించాడు. మారుతిపై గతంలోనూ దాడి చేయించాడు. ఇంకా వేధిస్తూనే వున్నాడు. మారుతి వెంట తెలుగుదేశం పార్టీ ఉంది గుర్తుపెట్టుకోండి అని హెచ్చరించారు.