అమెరికాలో మరోసారి కాల్పుల మోతమోగింది. టెక్సాస్‌లోని హోల్టోమ్ నగరంలో శనివారం ఓ వ్యక్తి జరిపిన కాల్పుల్లో ఇద్దరు మరణించగా.. నలుగురు గాయపడినట్లు అధికారులు తెలిపారు. కాల్పులకు తెగబడ్డ వ్యక్తి మరో ప్రాంతంలో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని వివరించారు. ఆ వ్యక్తి కాల్పులు ఎందుకు జరిపాడనే వివరాలు తెలియలేదన్నారు. కాగా, అమెరికాలో ఈ ఏడాది ఇప్పటివరకు 302 కాల్పుల ఘటనలు చోటుచేసుకున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa