పేద ప్రజలకు త్వరగా న్యాయం జరగాలి అనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమమే స్పందన. ఐతే ప్రతి సోమవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రజల ఇబ్బందులని తొలిగించడానికి, తగిన న్యాయం చెయ్యడానికి సహాయపడుతున్నారు. కానీ ఈ నెల 4వ తేదీ సోమవారం అనగా ఈ రోజు , మచిలీపట్నం కలెక్టరేట్ లో నిర్వహించే స్పందన కార్యక్రమం అనివార్య కారణాల వలన రద్దు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి . రంజిత్ బాషా ఆదివారం ఒక ప్రకటనలో తెలియజేశారు .