ఇంధన సంక్షోభం వల్ల శ్రీలంకలో పాఠశాల మూసివేతను జూలై 4 నుంచి మరో వారం పాటు పొడిగించారు. దీనిపై శ్రీలంక విద్యా మంత్రిత్వ శాఖ ఆదివారం ప్రకటన చేసింది. ఉపాధ్యాయులు, విద్యార్థులు తరగతి గదులకు చేర్చడానికి తగినంత ఇంధనం లేనందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వివరించింది. సెలవులు పూర్తైన తర్వాత సిలబస్‌ను త్వరితగతిన ప్రణాళికతో పూర్తి చేస్తామని పేర్కొంది.