రాష్ట్రంలో పెరిగిన ఆర్టీసీ చార్జీల కి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్షాలు నిరసనలు తెలియజేస్తూనే ఉన్నారు. ఈ సంఘటనలో భాగంగా పల్నాడు జిల్లా, నరసరావుపేట టీడీపీ పార్టీ ఇంచార్జి చదలవాడ అరవింద్ బాబు కూడా స్థానికంగా పార్టీ కార్యకర్తలతో కలిసి నిరసనలు తెలియజేసారు. ఆర్టీసీ ధరల పెంపును నిరసిస్తూ ఆదివారం నరసరావుపేట నుంచి ఫిరంగిపురం వరకు పల్లె వెలుగు బస్సులో ఆయన ప్రయాణం చేశారు. పెరిగిన బస్సు చార్జీల వల్ల ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకొని వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం జరిగింది.