ఈ నెల 4న అనగా ఈ రోజు (సోమవారం) భారత ప్రధాని నరేంద్ర మోడీ రాక సందర్భంగా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ పి . రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. ఆదివారం గన్నవరం ఎయిర్ పోర్ట్ లో జాయింట్ కలెక్టర్ మహేష్ కుమార్ రవిరాల తో కలసి ప్రధాని పర్యటన ఏర్పాట్లు పరిశీలించారు . సెక్యూరిటీ చెక్ పాయింట్, వి . ఐ . పి . లాంజ్ , ఎమ్మిగ్రేషన్ విభాగాలు పరిశీలించారు . తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ కార్యక్రమాలు జరగకుండా, శాంతి భద్రతలకు భంగం కలగకుండా వ్యవహరించాల్సిన అవసరం ఉందని, ఈ ద్యేయం తో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.