సీనియర్ సిటిజన్లకు ఢిల్లీ ప్రభుత్వం ఆదివారం బంఫర్ ఆఫర్ ప్రకటించింది. సీఎం తీర్థయాత్ర యోజన కింద సీనియర్ సిటిజన్లను ఉచితంగా పూరి జగన్నాథ్ యాత్రకు తీసుకెళ్లనుంది. ఈ స్క్రీంలో భాగంగా పెద్ద వయస్కులైన వారిని జులై 11 నుంచి జులై 28 వరకూ ఉచితంగా తీసుకెళ్తారని, ఇందుకోసం రెండు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసినట్లు ఢిల్లీ గవర్నమెంట్ తీర్థ యాత్ర వికాస్ సమతి ఛైర్మన్ కమల్ బన్సాల్ పేర్కొన్నారు.