గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతోంది. గ్రామాల్లో పర్యటిస్తున్న ప్రజాప్రతినిధులకు ఆదరణ లభిస్తోంది. అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమం కొనసాగుతోంది. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తున్నారు . ఏమైనా సమస్యలు తమ దృష్టికి వచ్చిన వెంటనే అక్కడికక్కడే వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. మేనిఫెస్టోలో పేర్కొన్న అన్ని హామీలను తప్పకుండా నెరువేరుస్తున్నామని ప్రజాప్రతినిధులు ప్రజలకు చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa