వంగవీటి మోహన రంగ పేరు తెలియని రాజకీయనాయకులు తెలుగు రాష్ట్రాల్లో లేరు అంటే నమ్మక తప్పదు. సామజిక న్యాయం అంటూ ప్రజలకి సేవ చేస్తూ.. ఉన్న ఇతను , కాంగ్రెస్ పార్టీ గుర్తింపుతో విజయవాడ నగరంలో స్థానికంగా ఎమ్మెల్యే పదవి చేసి ప్రజల కోసం పోరాటం చేస్తూ ప్రతి పక్షాల కుట్రలో భాగంగా హతుడైనాడు అని వార్తలు వచ్చాయి. కానీ ఎప్పటికి అతని చావుకి కారణం ఎవరో సూటిగా ఎవరు చెప్పలేరు. ఐతే ఈ రోజు ఆయన జానాతి కారణంగా రాష్ట్రము నలుమూలల అభిమానులు, కార్యకర్తలు వేడుకలు జరుపుతున్నారు. ఇంధులో భాగంగా పల్నాడు జిల్లా, నరసరావుపేట టీడీపీ ఇంచార్జి చదలవాడ అరవింద్ బాబు స్పందిస్తూ... బావి తరాలకు మీరో స్ఫూర్తిదాయకం....కులాలకు అతీతంగా మీ సేవలు మహోన్నతం...ఓ స్ఫూర్తి.... సమీప భవిష్యత్తులో మాత్రం మీ ఆశయాలు నిజం కావాలి....నిలువెత్తు మానవత్వమా వంగవీటి మోహన రంగా గారికి 75వ జయంతి సందర్భంగా మీకు మా నివాళులు అంటూ ట్విట్టర్ వేదికగా తెలియజేసారు.