ఏపీలోని వైఎస్ఆర్ జిల్లా యర్రగుంట్లలో సోమవారం విషాదం నెలకొంది. కుటుంబకలహాలతో ఇద్దరు పిల్లలతో సహా ఓ తల్లి నీటికుంటలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. మృతులను లక్ష్మదేవి, అక్షయ(8), రేవంత్ (6)గా స్థానికులు గుర్తించారు. స్థానికుల సమాచారంతో పోలీసులు గనిలోని నీటి కుంట వద్దకు చేరుకుని విచారణ చేపట్టారు. మృతదేహాలను నీటి కుంట నుంచి బయటకు తీశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa