గుంటూరు, తుళ్లూరు: మానసిక దివ్యాంగు రాలి పై కన్నతండ్రి లైంగిక దాడికి పాల్పడిన ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు తుళ్లూరు సిఐ దుర్గాప్రసాద్ తెలిపారు. తుళ్లూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన 20 ఏళ్ల మానసిక దివ్యంగురాలిపై జూన్ 12వ తేదీన తండ్రి అత్యాచారం చేశాడు. ఘటనపై బాధితురాలి తల్లి తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో ఆదివారం ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.