స్వాతంత్ర్య ఉద్యమంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జరిపిన సాయుధ పోరాటం కీర్తించదగినదని అనంతపురం జిల్లా అదనపు ఎస్పీ నాగేంద్రుడు, ఏ.ఆర్ అదనపు ఎస్పీ హనుమంతులు సంయుక్తంగా అభిప్రాయపడ్డారు. జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS ఆదేశాల మేరకు సోమవారం స్థానిక పోలీసు కాన్ఫరెన్స్ హాలులో అల్లూరి సీతారామరాజు 125 వ జయంతి నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఆయన త్యాగాలను స్మరించుకున్నారు. సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మి అదే బాటలో ప్రాణత్యాగం చేసిన విప్లవ వీరుడని కొనియాడారు. ఈకార్యక్రమంలో DCRB సి.ఐ విశ్వనాథచౌదరి, జిల్లా పోలీసు అధికారుల అడహక్ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.