సీఎం జగన్ తన వెనుక ఉన్నంత వరకు తనని ఎవరూ ఏమీ చేయలేరని వైసీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి పేర్కొన్నారు. యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత మొదటిసారి కర్నూలు కి విచ్చేసిన బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి స్వాగతం పలికారు. నగరంలో భారీ బైక్ ర్యాలీ చేపట్టి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా సిద్ధార్థరెడ్డి , రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాలులర్పించ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..సిద్ధార్థరెడ్డి వెనుక ఎవరున్నారని అందరూ అనుకుంటున్నారని, నా వెనకాల యువకులు, జగనన్న ఉన్నంతవరకు నన్ను ఎవరు ఏమి చేయలేరన్నారు.