మిస్ అండ్ మిసెస్ ఉత్తరాంధ్ర–2022 గ్రాండ్ ఫైనల్స్ ఆదివారం విశాఖపట్నం లో ఘనంగా నిర్వహించారు. న్యూ హోప్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు నాగమల్లేశ్వరి ఆధ్వర్యంలో నగరంలోని ఒక హోటల్లో నిర్వహించిన ఈ వేడుకల్లో యువతలు, మహిళలు తమ ప్రతిభా పాటవాలను ప్రదర్శించారు. ఫైనల్స్లో 20 మంది పాల్గొనగా మిస్ ఉత్తరాంధ్రగా నిధి చౌదరి, మిసెస్ ఉత్తరాంధ్రగా భాగ్యలక్ష్మి నిలిచారు. విజేతలకు బహుమతులు అందజేశారు.