ఢిల్లీలోని షహదారాలోని నలుగురు సభ్యుల ముఠా ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారుల పేరుతో బురిడీ కొట్టించారు. రూ.15 వేల నగదు, ఫోన్లు, నగలు దోచుకున్నారు. జులై 3న దొంగతనానికి పాల్పడిన ఈ నిందితులను సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని పంజాబ్‌కు చెందిన గుర్జంత్ సింగ్ (31), సత్పాల్ సింగ్ (28), గుర్‌ప్రీత్ (30), నవజోత్ సింగ్ (30)గా గుర్తించారు. ముఠాలో మరో 15 మంది ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa