తమ దేశానికి ఉపాధి నిమిత్తం వచ్చే వారికి కువైట్ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. 10 రోజుల వ్యవధిలోనే వర్క్ పర్మిట్ జారీ చేసే నూతన విధానానికి తాజాగా శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు వలస కార్మికులు దీని కోసం 3 నెలలు పాటి వేచి ఉండే వారు. అదనంగా వైద్య పరీక్షలకు 4 రోజులు కేటాయించాల్సి వచ్చేది. తాజా నిర్ణయంతో వలస కార్మికులకు ఆ బాధలు ఉండవు. అయితే కొత్త విధానంలో ఛార్జీల భారం పెరగనుంది.