వింబుల్డన్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో సానియా మీర్జా-మేట్ పావిక్(క్రొయేషియా) జోడీ సెమీ-ఫైనల్‌కు చేరుకుంది. సోమవారం జరిగిన క్వార్టర్-ఫైనల్ మ్యాచ్‌లో గాబ్రియేలా డబ్రోవ్స్కీ, జాన్ పీర్లను ఓడించారు. సానియా, పావిక్లు మొత్తం గంట 41 నిమిషాల్లో 6-4, 3-6, 7-5 తేడాతో డబ్రోవ్స్కీ-పీర్స్పై విజయం సాధించారు. ఆఖరి సెట్లో ఒత్తిడికి లోనుకాకుండా సానియా, పావిక్లు రిటర్న్‌లతో ప్రత్యర్థులపై చక్కటి ఆటతీరు కనబర్చారు.