అండమాన్ అండ్ నికోబార్ దీవులను వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. మంగళవారం దాదాపు 11 సార్లు భూమి కంపించిందని, ఉదయం 5.57 గంటలకు రిక్టర్ స్కేల్‌పై 5.0 తీవ్రతతో బలమైన ప్రకంపనలు వచ్చాయని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. అయితే, ఇప్పటి వరకు ప్రాణ, ఆస్తి నష్టం సంభవించినట్లు ఎలాంటి నివేదికలు అందలేదని అధికారులు తెలిపారు. కాగా, సోమవారం దాదాపు 13 సార్లు భూమి కంపించింది.