కర్నూలు జిల్లా ఆదోని మున్సిపల్ పాఠశాలలో విద్యాకానుక కిట్లను ఏపీ సీఎం జగన్ మంగళవారం ప్రారంభించారు. ఈ పథకం కోసం రూ.931 కోట్లు వెచ్చించినట్లు వెల్లడించారు. పేదరికాన్ని పొగొట్టేది చదువేనని చెప్పారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు విద్యాకానుక, గోరుముద్ద, అమ్మ ఒడి, నాడు-నేడు వంటి పథకాలను అమలు చేస్తున్నట్లు వివరించారు. ఇంగ్లీషు మీడియం అభ్యసిస్తే ప్రపంచంలో ఎక్కడైనా కొలువు సాధించవచ్చన్నారు.