వర్షాకాలంలో బట్టలు సరిగా ఆరవు. దీంతో దుర్వాసన వస్తుంటాయి. అయితే, బట్టలు ఉతికేటప్పుడు, లాండ్రీ పౌడర్‌లో కొద్దిగా వెనిగర్ లేదా బేకింగ్ సోడాను నీటిలో కలపండి. దీంతో బట్టలకు వర్షం వల్ల వచ్చే దుర్వాసన పోతుంది. అలాగే, బట్టలు ఉతుకుతున్నప్పుడు అందులో నిమ్మరసం నీళ్ళు కలుపుకోవాలి. ఇది వాసనను తొలగిస్తుంది.