గుంటూరు, పొన్నూరు: నిడుబ్రోలు 13వ వార్డుకు చెందిన యరం చిన్నమ్మాయి కుమారుడు నవీన్ వాంతులతో బాధపడుతుండగా.. పట్టణంలోని ఓ ప్రైవేట్ వైద్యశాలకు తీసుకెళ్లారు. అక్కడు చికిత్స పొందుతూ నవీన్ మృతి చెందాడు. దీనిపై నవీన్ తల్లి వైద్యుల నిర్లక్ష్యంతోనే మృతి చెందారని.. మంగళవారం పట్టణ పోలీస్ లకు ఫిర్యాదు చేసింది. తల్లి ఫిర్యాదు మేరకు పట్టణ ఎస్ఐ షేక్ హషిమ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.