ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అందరి కలయిక కోసమే ప్లీనరీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 05, 2022, 03:07 PM

గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సమీపంలో వైయస్‌ఆర్‌ సీపీ ప్లీనరీ సమావేశాల ఏర్పాట్లను గడికోట శ్రీకాంత్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భారీ ఎత్తున ప్లీనరీ సమావేశాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయన్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి వైయస్‌ఆర్‌ కుటుంబ సభ్యులు లక్షలాది మంది వచ్చినా ఎలాంటి అసౌకర్యం కలగకుండా సదుపాయాలు కల్పించనున్నామన్నారు. సీఎం వైయస్‌ జగన్‌ రెండ్రోజులు పూర్తిగా ప్లీనరీ సమావేశాల వద్దే ఉంటారని, రాబోయే కాలానికి దిశానిర్దేశం చేస్తారన్నారు. ప్లీనరీ సమావేశాల కోసం తరలివచ్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త ఎదురుచూస్తున్నారన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com