‘జగనన్న పాదయాత్ర చేసినప్పుడు ఏ విధంగా పేదల కష్టాలు తెలుసుకున్నారో.. ముఖ్యమంత్రి అయిన తరువాత ఆ కష్టాలన్నీ పేదల నుంచి దూరం చేస్తున్నారు అని ఆదోని వైయస్‌ఆర్ సీపీ ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి అన్నారు.. ప్రభుత్వాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లారు. గతంలో మండల వ్యవస్థ తీసుకువస్తే.. సీఎం వైయస్ జగన్ గ్రామ సచివాలయ, వలంటీర్ల వ్యవస్థ తీసుకువచ్చి.. పాలనను ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. 1.35 లక్షల మందికి సచివాలయ వ్యవస్థతో శాశ్వత ఉద్యోగాలు కల్పించారు. డాక్టర్‌గా ప్రజల నాడిపట్టుకొని ఆరోగ్యశ్రీ, ఫీజురీయింబర్స్‌మెంట్, రైతు రుణమాఫీ, ఉచిత కరెంటు, మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్ అన్ని కార్యక్రమాలు ప్రజలు మెచ్చే విధంగా మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి పాలన సాగింది. ఆ తరువాత వచ్చిన ముఖ్యమంత్రులు ప్రజలకు సహకారం అందించే కార్యక్రమాలు ఏమీ చేయలేదు. వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఏ ఒక్క విషయంలో కూడా ప్రజలకు అనుకూలంగా ప్రభుత్వాన్ని నడపలేదు అని మాట్లాడారు.