ఈ ఏడాది 47.40 లక్షల మంది విద్యార్థులకు జగనన్న విద్యా కానుక అందజేస్తున్నట్లు మంత్రి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఏర్పాటు చేసిన జగనన్న విద్యా కానుక పంపిణీ కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ... .. గత మూడేళ్లుగా విద్యా రంగానికి సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి జగనన్న విద్యా కానుక అందజేస్తున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభమైందంటే తల్లిదండ్రులు ఎంతో దిగులుపడేవారు. తమ పిల్లలకు బుక్స్, నోట్స్, యూనిఫాం కొనాలని బాధపడేవారు. ఇబ్బందులు పడే సందర్భాలు చూశాం. కానీ వైయస్ జగన్ సీఎం కాగానే తల్లిదండ్రులకు అలాంటి ఆందోళనలు వద్దని, ఠీవిగా స్కూల్‌కు వెళ్లాలనే ఉద్దేశంతో జగనన్న కానుక ప్రవేశపెట్టారు. వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలో రాష్ట్రంలోని విద్యార్థులందరికీ చదువుకునే అవకాశం కల్పించారు. ఆయన తనయుడు వైయస్ జగన్ మరో రెండడుగులు ముందుకు వేశారు. అందరూ చదువుకునేలా ఏర్పాటు చేశారు. తనను విద్యాశాఖ మంత్రిగా భాగస్వామ్యం కల్పించడం సంతోషంగా ఉంది అని తెలియజేసారు.