పాక్ లో ఇండియాకు చెందిన స్పైస్ జెట్ అత్యవసర ల్యాండింగ్ అయ్యింది. ఢిల్లీ నుంచి దుబాయ్ కి విమానం వెళ్తుండగా కరాచీలో అత్యవసర ల్యాండింగ్ అయ్యింది. ఫ్యూయల్ ఇండికేటర్ సమస్యతో కరాచీలో ల్యాండ్ అయ్యింది. దీంతో 185 మంది ప్రయాణికులు సేఫ్ అయ్యారు. గత 15 రోజుల్లో స్పైస్ జెట్ విమానాలకు సంబంధించి ఇలాంటి ఘటనలు జరగడం ఆరవ సారి. ప్రయాణికులకు ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.