వైఎస్సార్ వాహనమిత్ర పథకం 2022-23 లబ్ధిదారులకు ఏపీ ప్రభుత్వం జూలై 13న ఆర్థికసాయం అందించనుంది. ఈ పథకం కింద అర్హులైన ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ కలిగిన డ్రైవర్లకు ఏటా రూ.10 వేలు ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది కొత్త వారికి కూడా అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జూలై 7లోగా గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని రవాణా శాఖ తెలిపింది.